‘పుష్ప 2’ విడుదల సందర్భంగా మెగా హీరోలకు, అల్లు అర్జున్ కి మధ్య ఉన్న గ్యాప్ గురించి చాలా చర్చ జరిగింది. ఆ సినిమాలో ఒక సీన్, కొన్ని డైలాగ్స్ కూడా రామ్ చరణ్ ని కించపరిచేలా ఉన్నాయి అన్న టాక్ వచ్చింది. దాంతో, సుకుమార్ కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. మెగా హీరోలు, అల్లు అర్జున్ మధ్య గొడవల్లో తనని అనవసరంగా ఇరికిస్తున్నారు అని భావించారు. కానీ, రామ్ చరణ్ అలాంటివి పట్టించుకోలేదు. అందుకే, తన కొత్త సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా సుకుమార్ ని ఆహ్వానించారు.
‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న అమెరికాలో భారీ ఎత్తున జరగనుంది. డల్లాస్ జరిగే ఈ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం ఇదే మొదటి సారి. ఈ వేదికపై రామ్ చరణ్, సుకుమార్ అలరించనున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఆ సినిమా నిర్మాణంలో సుకుమార్ కి భాగస్వామ్యం ఉంది. ఇక ఆ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లోనే నటిస్తారు. “పుష్ప 3″ని పక్కన పెట్టి సుకుమార్ రామ్ చరణ్ తో మూవీ చేస్తారు.
ఇమరోవైపు ఇటీవల విడుదలైన “నా నా హైరానా” సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శంకర్ తరహా భారీతనం ఉట్టిపడుతోంది ఆ పాటలో. “గేమ్ చేంజర్’పై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.