ఇటీవల అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య గ్యాప్ పెరిగింది అన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే పరిణామాలు జరిగాయి. కానీ అవసరమైన సమయంలో మెగా కుటుంబం అంతా ఒక్కటిగా అవుతుంది అని మరోసారి ప్రూవ్ చేసింది.
తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హుటాహుటిన బన్నీ ఇంటికి వెళ్లారు. ఒకదశలో మెగాస్టార్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని భావించారు. కానీ పోలీసులు అనుమతించలేదు. అలాగే బన్నీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
ఈ కేసులో బన్నీకి బెయిల్ రప్పించేందుకు మెగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
“పుష్ప 2” సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ సొంతంగా తాను పాన్ ఇండియా స్టార్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ప్రవర్తించారు. దాంతో మెగాభిమానులు ఫీల్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తమ మధ్య విబేధాలు, కుటుంబ గొడవలు పక్కనపెట్టి మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడికి అండగా ఉండేందుకు వచ్చారు.