![Sudheer Babu](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/06/sudheerbabu-haromhara.jpg)
“మా నాన్న సూపర్ హీరో”.. టైటిల్ లోనే ఇది తండ్రీకొడుకుల కథ అనే విషయం అర్థమౌతోంది. అయినప్పటికీ కొంతమంది దీన్ని థ్రిల్లర్ అనుకున్నారు. దీనికి కారణం ట్రయిలర్. సినిమా ట్రయిలర్ చివర్లో సుధీర్ బాబు గన్ పట్టుకొని కనిపిస్తాడు, ఓ తండ్రి జైళ్లో ఉంటాడు. దీంతో ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అనుకున్నారు కొంతమంది.
తాజాగా దీనిపై స్పందించాడు సుధీర్ బాబు. తన సినిమాలో థ్రిల్లర్ జానర్ లేదని స్పష్టం చేశాడు. పూర్తిగా తండ్రీకొడుకుల భావోద్వేగాలతో సినిమా తెరకెక్కిందని క్లారిటీ ఇచ్చాడు. సినిమా మొదలైన 5 నిమిషాలకే కథ ఏంటనే విషయం అందరికీ అర్థమైపోతుందని, అయితే కథలో ఆ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి కారణాలేంటనే విషయాన్ని దశలవారీగా రివీల్ చేశామని వెల్లడించాడు.
ఈ సినిమాలో నటించడానికి తను పెద్దగా కష్టపడలేదంటున్నాడు సుధీర్ బాబు. రియల్ లైఫ్ లో తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తానని, అదే ప్రేమను తెరపై కూడా చూపించానని అన్నాడు.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబుకు, ఈ సినిమా హిట్టవ్వడం అత్యవసరం. ఇందులో సుధీర్ బాబు పెంపుడు తండ్రిగా సాయాజీ షిండే, కన్నతండ్రిగా సాయిచంద్ నటించారు.