రజనీకాంత్.. వెండితెరపై సూపర్ స్టార్. నిజజీవితంలో మాత్రం ఆయనొక యోగి. ఇలా 2 డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉంటారాయన. మరి ఈ రెండు అవతారాల్లో రానాకు ఏదిష్టం. తనకు రియల్ లైఫ్ రజనీకాంతే ఇష్టం అంటున్నాడు రానా.
సూపర్ స్టార్ తో కలిసి “వేట్టయన్” సినిమా చేసిన రానా, ఆయన్ను అలా చూస్తూ చాలా నేర్చుకోవచ్చని చెబుతున్నాడు. ఇక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బోలెడన్ని విషయాలు, తాత్విక అంశాలు వస్తుంటాయని.. వాటిలో కనీసం 10శాతం పాటించినా, మన జీవితం కొత్త మలుపు తిరుగుతుందని అన్నాడు.
“వేట్టయాన్” సినిమాలో క్యాపిటలిస్ట్ పాత్ర పోషించాడు రానా. అతడి పాత్ర అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో సాగుతుంది.
రజనీకాంత్ ముందు తను నిలబడగలనా లేదా అనే సందేహం తనకు షూటింగ్ టైమ్ లో కలిగిందని, రజనీతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత అలాంటి సందేహాలన్నీ పక్కనపెట్టి.. ఆయనతో గడిపిన సమయాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టానని అన్నాడు.