
నిజజీవితంలో తను, గోపీచంద్ కంప్లీట్ రివర్స్ అంటోంది హీరోయిన్ కావ్య థాపర్. అతడి సరసన ‘విశ్వం’ సినిమాలో నటించిన ఈ చిన్నది.. సెట్స్ లో గోపీచంద్ కు పూర్తి వ్యతిరేకంగా తను ఉండేదాన్నని గుర్తు చేసుకుంది.
“నేను చాలా ఫాస్ట్ గా జోవియల్ గా ఉంటాను. గోపీచంద్ చాలా కామ్ గా ఉంటారు. సెట్లో చాలా సైలెంట్. తన పనేదో తాను చేసుకుంటారు. అందుకు భిన్నమైన కారెక్టర్ నాది. అందుకే ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మాడ్యులేషన్ పరంగా చాలా గ్రహించాను. ఒక రకంగా తెలుగు కూడా నేర్చుకున్నా.”
గోపీచంద్, కావ్యథాపర్ జంటగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా 11న థియేటర్లలోకి వస్తోంది.
ఈ సినిమాలో ఐకానిక్ ట్రయిన్ ఎపిసోడ్ ను రిపీట్ చేశాడు వైట్ల. దీనిపై స్పందించిన కావ్య థాపర్.. గత చిత్రంలోని ట్రయిన్ ఎపిసోడ్ కు, విశ్వంలోని ట్రైన్ ఎపిసోడ్ కు సంబంధం ఉండదని అంటోంది. విశ్వం సినిమా చాలా కొత్తగా ఉంటుందని, తన పాత్ర కూడా కొత్తగా ఉంటుందని చెబుతోంది.