బాలీవుడ్ భామ ఆలియా భట్ కి తెలుగు వారితో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఆమె “బ్రహ్మస్త్ర” సినిమా నుంచి వరుసగా తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లో కూడా నటించింది. ఇప్పుడు ఆమె నటించిన ‘జిగ్రా’ చిత్రం తెలుగులో అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది ఆలియా. ఈ ఈవెంట్ కి రానా, త్రివిక్రమ్, సమంత అతిథులుగా వచ్చారు.
“నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది,” అని చెప్పింది ఆలియా
“నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం.”