హీరోయిన్ మేఘా ఆకాష్ ప్రస్తుతం ఇటలీలో ఉంది. ఇదేదో సినిమా షూటింగ్ కోసం వెళ్లింది కాదు. తన భర్త సాయివిష్ణుతో కలిసి ఆమె హనీమూన్ లో ఉంది. ఇందులో భాగంగా ఇటలీలో ల్యాండ్ అయింది. యూరోప్ లోని పలు దేశాల్లో పర్యటిస్తోంది మేఘా ఆకాష్.
ఇప్పటికే అక్కడ్నుంచి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తమిళనాడు కాంగ్రెస్ లీడర్ కొడుకు సాయివిష్ణు, మేఘా ఆకాష్ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దల్ని ఒప్పించారు. గత నెలలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
రీసెంట్ గా హీరోయిన్లు ఎవ్వరూ హనీమూన్ లాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు. ఇలా పెళ్లి చేసుకొని అలా సెట్స్ లో వాలిపోతున్నారు. అయితే మేఘా ఆకాష్ చేతిలో సినిమాల్లేకపోవడం వల్ల ఆమె హనీమూన్ వైపు మొగ్గుచూపించింది. తిరిగి ఆమె సినిమాల్లోకి వస్తుందా, ఫ్యామిలీ లైఫ్ కే పరిమితమైపోతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తెలుగులో ఆమె చెప్పుకోదగ్గ సినిమాలే చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. శ్రీవిష్ణుతో చేసిన ‘రాజరాజచోర’ మాత్రమే ఆమెకు ఉన్నంతలో కలిసొచ్చింది. అయితే ఆ తర్వాత కూడా ఫ్లాపులు రావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి.