
హీరోయిన్ సంయుక్త చాలా బిజీ. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి ఐదు సినిమాల షూటింగుల్లో ఆమె పాల్గొంటోంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఆమెకు ఉన్న క్రేజ్, ఆమె బిజీ షెడ్యూలు ఎంతో.
తాజాగా ఆమె ఒక కొత్త సినిమా ప్రారంభించింది. ఇందులో హీరో లేరు. ఆమె హీరో, హీరోయిన్. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం.
“అవును నేను చాలా బిజీగా ఉన్నాను. సెట్స్ పై ఐదు చిత్రాలు ఉన్నాయి. ఆ ఐదు చేస్తూనే ఈ సినిమా ఒప్పుకున్నా. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ వున్న కథే.. కానీ ఈ కథని హీరో కూడా చేయొచ్చు. అంత మంచి కథ. అందుకే ఇది ఒప్పుకున్నాను,” అని చెప్పింది.
ALSO READ: Samyuktha’s action thriller launched
ఆమె చేస్తున్న ఆ ఐదు చిత్రాల్లో ఒకటి శర్వానంద్ హీరోగా మూవీ, మరోటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ సరసన “స్వయంభు” చిత్రం కూడా ఉంది. “మహారాణి” అనే హిందీ సినిమా కూడా చేస్తోంది.