నటుడు సుబ్బరాజు బ్యాచిలర్ అనే విషయం, ఆయనకు మొన్న పెళ్లయిన తర్వాత చాలామందికి తెలిసింది. 47 ఏళ్ల వయసులో ఈ క్యారెక్టర్ ఆర్టిస్టు పెళ్లి చేసుకున్నాడు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలతో పాటు, పెళ్లి విశేషాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు సుబ్బరాజు. అమ్మాయి పేరు స్రవంతి. పేరుకు అమెరికాలో పెళ్లి అయినప్పటికీ, తెలుగు సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి జరిగింది. అంతేకాదు, అమెరికా నుంచే తన భార్యకు అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు సుబ్బరాజు.
ఇక స్రవంతి విషయానికొస్తే, ఆమె కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడింది. ఆమె అక్కడే డెంటిస్టుగా పని చేస్తోంది. కొలంబియా యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీల నుంచి ఆమె పట్టాలు పొందింది.
స్రవంతికి సైన్స్ అంటే చాలా ఇష్టమంట. దానికితోడు ఆమెకు ఫిట్ నెస్ అంటే కూడా చాలా ఇష్టం. సుబ్బరాజు-స్రవంతి ఎలా కలిశారు.. వీళ్లది లవ్ మ్యారేజా.. ఎరేంజ్డ్ మ్యారేజా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.