
ఒక హారర్ కామెడీ మూవీ ఇండియాలో మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని మొన్నటివరకు ఎవరూ ఊహించలేదు. పెద్ద స్టార్ లేని మూవీ ఆ రేంజ్ లో వసూళ్లు చెయ్యడంతో అందరికి మైండ్ బ్లాంక్ అయింది.
“స్త్రీ 2” సినిమా ఇప్పుడు దర్జాగా 300 కోట్ల మార్క్ దాటేసింది. వడివడిగా 400 కోట్ల మార్క్ అందుకునేందుకు పరిగెడుతోంది. ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే “యానిమల్”, “గదర్ 2” సినిమాల సరళి కనిపిస్తోంది. వాటిలాగే ఈ సినిమా కూడా 500 కోట్ల వసూళ్లు అందుకుంటుందా అనేది చూడాలి.
“స్త్రీ” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లలోపే కలెక్ట్ చేసింది. రెండో భాగం ఇండియాలోనే 300 కోట్ల మైలురాయి దాటేసింది.
రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన “స్త్రీ 2″లో శ్రధ్ద కపూర్ మెయిన్ హీరోయిన్ రోల్. ఐతే, శ్రద్ధ సినిమాలో కన్పించేది తక్కువే. ఆమె నిడివి చాలా చిన్నదే అయినా శ్రద్ధ వల్లే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అనేది నిజం. ఇక సినిమా కథ, కథనాలు అంచనాలు అందుకోవడంతో ఈ రేంజ్ లో ఆడుతోంది.