శ్రీకాంత్, తన కొడుకు రోషన్ ను చాలా ఎర్లీగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడా? అసలు కొడుకును పరిశ్రమకు తీసుకొద్దామనే ఆలోచన శ్రీకాంత్ కు ఉందా? ఆయనేం అంటున్నాడు.
“రోషన్ బాగా చదువుతాడు. స్టడీస్ పైనే అతడున్నాడు. దానికితోడు క్రికెట్ బాగా ఆడతాడు. అతడ్ని క్రికెటర్ ను చేయాలనేది నా కోరిక. ఇండియా క్రికెట్ స్టేట్ లెవెల్ కు కూడా సెలక్ట్ అయ్యాడు. ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకునేలోపు ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా చేశాడు.”
అలా రోషన్ డెస్టినీ మారిపోయిందంటున్నాడు శ్రీకాంత్. అతడి లాంచింగ్ సరిగ్గా లేదని అంగీకరించిన శ్రీకాంత్, ఇప్పుడు రోషన్ సరైన ఏజ్ లో ఉన్నాడని, రీ-లాంఛింగ్ కు రెడీ అవుతున్నాడని అన్నాడు.
“వాడు సినిమాలే చేస్తానన్నాడు. ప్రైవేట్ గా చదువుతూనే లాస్ ఎంజెల్స్ లో ట్రయినింగ్ తీసుకున్నాడు. అప్పుడే హీరో పాత్రలకు తీసుకోరు కాబట్టి, ముంబయి వెళ్లి సల్మాన్ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు.”
ఆ తర్వాత ‘పెళ్లి సందడి’ చేశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ బాగా పనికొచ్చిందని, రోషన్ కు మంచి పాత్రలు వస్తున్నాయని అంటున్నాడు శ్రీకాంత్.