వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఇప్పటికే “ఎఫ్ 2”, “ఎఫ్ 3” వచ్చాయి. రెండూ పెద్ద హిట్ చిత్రాలే. మూడో చిత్రంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు…
సంక్రాంతికి రేసులో ఈ సినిమాని నిలపాలని ముందే అనుకోని ఈ టైటిల్ పెట్టారా?
వెంకటేష్ గారితో చేసిన “ఎఫ్2” పొంగల్ కి వచ్చి పెద్ద విజయం సాధించింది. “ఎఫ్”3 కూడా పొంగల్ కి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్ కి తీసుకొస్తే బావుటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం. ఈ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్ కి సంబధించింది. కథ ప్రకారం సంక్రాంతి పండుగతో లింక్ ఉంది. అందుకే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అన్ని విధాలా సరిపోతుంది అని భావించాం.
మీరు చేసిన ప్రమోషన్స్ చాలా వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉండటానికి కారణం?
కోవిడ్ తర్వాత సినిమా మొత్తం మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే సరిపోదు. థియేటర్స్ కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ వుండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు.మన సినిమా వస్తోంది అని అందరికీ తెలియాలంటే చాలా హంగామా చెయ్యాలి. అందుకే ఈసారి సోషల్ మీడియాపై ఎక్కవ ఫోకస్ చేశాం.
ఐశ్వర్య రాజేష్ నటిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకొంది. అయినా ఆమెకి ఆడిషన్ చేశారట?
అవును. ఐశ్వర్య మంచి నటి కానీ ఆమెకి రాసిన పాత్ర ప్రకారం యాస కూడా ముఖ్యం. ఆమె గోదారి యాస పట్టుకోగలదా, ఆ ప్రాంతపు వారి బాడీ లాంగ్వేజ్ లో ఎలా ఉంటుంది అని చూడ్డానికి చిన్న టెస్ట్ చేశాం. ఈ సినిమాతో ఐశ్వర్యకి మరింత మంచి పేరు వస్తుంది. ఐశ్వర్య తో పాటు మీనాక్షి చక్కగా పెర్ఫార్మ్ చేసింది. హీరోయిన్లు ఇద్దరూ ఆదరగొట్టారు.
దిల్ రాజు బ్యానర్ లోనే ఎక్కువగా చేయడానికి కారణం?
ఆయనతో నాకు “పటాస్” సినిమా నుంచి అనుబంధం ఉంది. దిల్ రాజు గారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీ..
ఎఫ్ 2 నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకూ వెంకటేష్ గారితో జర్నీ ఎలా వుంది?
ఎఫ్ 2, ఎఫ్ 3 కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మా బాండింగ్ డబుల్ అయ్యింది. ఈ సినిమాతోచాలా క్లోజ్ అయ్యాం. వెంకటేష్ గారితో సినిమాలు ఇలానే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను. ఈ సారి కటేష్ గారితో ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేశాను. ఎంటర్ టైన్మెంట్ తో పాటు క్రైమ్ రెస్క్యు ఎడ్వంచర్ ఉంటుంది. కానీ వినోదం మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు.
మీ డ్రీం ప్రాజెక్ట్?
అమ్మాయిల చుట్టూ తిరిగే క్రీడా చిత్రం తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. త్వరలోనే తీస్తాను.
“ఎఫ్4” ఎప్పుడు ?
డెఫినెట్ గా ఉంటుంది కానీ దానికి కొంత టైం పడుతుంది.