![Priyadarshi](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/07/priyadarshi-prabhas-1024x768.jpg)
కొన్ని రోజుల కిందటి సంగతి.. “రా..మచ్చా..మచ్చా” సాంగ్ రిలీజైంది. అందులో చరణ్ తో పాటు ప్రియదర్శి కనిపించాడు. అంతకంటే ముందు ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ లో తన పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పాడు. కట్ చేస్తే, గేమ్ ఛేంజర్ రిలీజైంది. ప్రియదర్శి చెప్పిన ఆ గొప్ప పాత్ర మాత్రం కనిపించలేదు.
గేమ్ ఛేంజర్ లో తిప్పికొడితే 2-3 ఫ్రేమల్లో మాత్రమే కనిపించాడు ప్రియదర్శి. లిరికల్ వీడియోలో చూపించిన సన్నివేశాలే సినిమాలో కూడా కనిపించాయి. టాకీలో ఒక్కటంటే ఒక్క సీన్ లేదు. ఒక్క డైలాగ్ లేదు. రిజిస్టర్ అయ్యే ఫ్రేమ్ ఒక్కటి లేదు.
నిజానికి రామ్ చరణ్ ఫ్రెండ్ క్యారెక్టల్ లో ప్రియదర్శి కోసం చాలా పెద్ద పాత్ర రాసుకున్నాడు దర్శకుడు శంకర్. కాలేజ్ ఎపిసోడ్ కూడా చాలా పెద్దది సెట్ చేశాడు. కానీ అప్పన్న పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో చరణ్ కాలేజీ ఎపిసోడ్ కు సెన్సార్ కత్తెర పడింది. ఫలితంగా ప్రియదర్శి పాత్ర దాదాపు లేచిపోయింది.
ప్రియదర్శి మాత్రమే కాదు, సినిమాలో ఇలాంటి పాత్రలు ఇంకొన్ని కూడా ఉన్నాయి. సీనియర్ నరేశ్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ పోషించిన పాత్రలు భారీగా ట్రిమ్ అయ్యాయి.