‘డాకు మహారాజ్’ సినిమా కోసం తిరుగులేని సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు నిర్మాత నాగవంశీ. ‘అల వైకుంఠపురములో’ హిట్టయింది కాబట్టి, ‘డాకు మహారాజ్’ కూడా తప్పకుండా హిట్టవుతుందని చెబుతున్నాడు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే…
“ఐదేళ్ల కిందట వైకుంఠ ఏకాదశి రోజున ‘అల వైకుంఠపురములో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేశాం. 12వ తేదీ రిలీజైంది, ఆ రోజు ఆదివారం. ఈసారి ‘డాకు మహారాజ్’ కు కూడా సేమ్ అదే రిపీటైంది. వైకుంఠ ఏకాదశి రోజున ఫంక్షన్ చేశాం. సినిమా 12న రిలీజ్ అవుతోంది. ఈసారి కూడా ఆదివారం పడింది. సో.. అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నాం.”
ఇలా తిరుగులేని సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు నాగవంశీ. తను, దర్శకుడు బాబి, మ్యూజిక్ డైరక్టర్ తమన్.. బాలయ్య అభిమానులమని, ఇలాంటి అభిమానులంతా కలిసి ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ‘డాకు మహారాజ్’ అలా ఉంటుందని చెబుతున్నాడు.
బాలయ్య డ్యూయర్ రోల్ చేసిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాద్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌథేలా స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు, కీలక పాత్రలో కనిపించింది.