యాంకర్ కమ్ నటి శ్రీముఖి తనపై చెలరేగిన విమర్శల దాడిని తగ్గించింది. అందరికీ భేషరతుగా క్షమాపణలు చెప్పింది. “అందరూ నన్ను క్షమించాలి, జై శ్రీరామ్” అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఏమైంది?
నిజామాబాద్ లో జరిగిన “సంక్రాంతికి వస్తున్నాం” ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు యాంకరింగ్ చేసింది శ్రీముఖి. దిల్ రాజు, శిరీశ్ ను పొగిడే క్రమంలో రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంది. అంతే.. హైందవులు భగ్గుమన్నారు.
శ్రీముఖిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు తెగబడ్డారు.
తన వల్ల డ్యామేజీ జరిగిందనే విషయాన్ని గుర్తించింది శ్రీముఖి. వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పింది. తను కావాలని అలా అనలేదని, పొరపాటున తన నోటి నుంచి అలా వచ్చేసిందని, అంతా పెద్ద మనసుతో తనను క్షమించాలని వేడుకుంది.