శ్రీదేవి విజయ్ కుమార్ తెలుసా? 20 ఏళ్ల క్రితం ప్రభాస్ సరసన నటించింది. అవును ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ ఆమె. ప్రభాస్ మొదటి చిత్రం “ఈశ్వర్”, తరుణ్ “నిన్నే ఇష్టపడ్డాను” వంటి సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా క్రేజ్ దక్కలేదు. దాంతో, 2009లో రాహుల్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో స్థిరపడింది.
ఆమెకి ఇప్పుడు 37 ఏళ్ళు. 8 ఏళ్ల కూతురు ఉంది. ఇప్పుడు హీరోయిన్ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె హీరోయిన్ గా మళ్ళీ నటించాలనుకోవడంలో విశేషం లేదు కానీ ఆమెని ఇప్పుడు హీరోయిన్ గా తీసుకున్న దర్శక, నిర్మాతలు ఉండడం విశేషమే.
నారా రోహిత్ ముదురు బ్రహ్మచారిగా నటిస్తున్న “సుందరకాండ” అనే సినిమాలో ఈ 37 ఏళ్ల భామ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.