
నటి మంచు లక్ష్మి ఇటీవల తెగ ఎక్స్ పోజింగ్ తో కూడిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కుర్రాళ్ళని కవ్విస్తున్న ఈ భామ సడెన్ గా తన పెదవులకు మొత్తంగా బ్యాండేజ్ వేసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి కలకలం రేపింది.
ఆమె ముఖానికి అంత తీవ్రంగా గాయాలు ఎలా అయ్యాయి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. గంట తర్వాత అసలు విషయం ఇదీ అంటూ ఆమె కొని వీడియోలు షేర్ చేసింది. ఒక ట్యాబ్లేట్ వేసుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది అని చెప్పింది.
ఆమె ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ తీసుకుందట. అది వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. ఇప్పుడు తగ్గిందట.
ఐతే మనం సాధారణంగా తీసుకునే మందుల వల్ల కూడా అలెర్జీ వచ్చి, చర్మం పాడు అవుతుందనే విషయం అందరికీ తెలియచెప్పాలని, అందరిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫోటోలు, ఈ వీడియోలు పెట్టిందట.