రామ్ చరణ్ లాంటి హీరోలు నేరుగా హిందీలో సినిమాలు చేశారు. చివరికి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. మరి నాని సంగతేంటి? ఇదే ప్రశ్న అతడికి బాలీవుడ్ మీడియా నుంచి ఎదురైంది.
నాని ప్రస్తుతం “సరిపోదా శనివారం” సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. దీన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా తను హిందీ సినిమాలు చూశానని చెప్పిన నాని.. హిందీలో స్ట్రయిట్ సినిమా చేయడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేరుగా హిందీలో సినిమా చేయాలనే ఆసక్తిని రేకెత్తించే కథ తనకు ఇంతవరకు దొరకలేదని అన్నాడు. అలాంటి స్టోరీ దొరికినప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడతానని స్పష్టం చేశాడు.
అమితాబ్ కు పెద్ద ఫ్యాన్ గా చెప్పుకొచ్చాడు నాని. బిగ్ బి నటించిన “అగ్నిపథ్” సినిమాను చాలాసార్లు చూశానని, అందులో హీరో ఇంట్రడక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసినప్పుడు.. “అగ్నిపథ్” స్ఫూర్తితో కొన్ని కథలు కూడా రాసుకున్నాడట నాని.