
కొన్ని రోజుల కిందటి సంగతి. వరలక్ష్మి శరత్ కుమార్ గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లికి తానే స్వయంగా వెళ్లి కొంతమందికి ఆహ్వానాలు అందించింది. కోలీవుడ్, టాలీవుడ్ మొత్తం కవర్ చేసింది. ఇప్పుడిదే పద్ధతిని మేఘా ఆకాష్ కూడా ఫాలో అవుతోంది.
రీసెంట్ గా సాయివిష్ణుతో మేఘా ఆకాష్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలుపెట్టారు. కాబోయే భర్తతో కలిసి రజనీకాంత్ ను కలిసింది మేఘా ఆకాష్. వెడ్డింగ్ కార్డ్ అందించి పెళ్లికి ఆహ్వానించింది.
త్వరలోనే ఆమె హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అవ్వబోతోంది. కలిసి నటించిన హీరోలకు పెళ్లి కార్డులు అందించబోతోంది. తెలుగులో ఆమె నితిన్, రవితేజ, శ్రీవిష్ణు లాంటి హీరోలతో నటించింది.
మేఘా ఆకాష్ పెళ్లి డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటుందా లేక చెన్నైలోనే పెళ్లి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కొడుకు సాయివిష్ణుతో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉంది మేఘా ఆకాశ్. సాయివిష్ణుకు పలు వ్యాపారాలున్నాయి.