
త్వరలోనే బుచ్చిబాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రామ్ చరణ్. ఈ మూవీకి సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ తో సహా అంతా సిద్ధంగా ఉంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్పోర్ట్స్ యాక్షన్ మూవీ (#RC16) ఇది. ఈ విషయం కూడా బయటకొచ్చింది.
ఇలా అంతా సిద్ధమనుకున్న టైమ్ లో కీలక ప్రకటన చేశాడు రామ్ చరణ్.
బుచ్చిబాబు సినిమాలో తను మంచి కామెడీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఓ కార్యక్రమానికి హాజరైన చరణ్ కు.. యాక్షన్, కామెడీలలో ఏ జానర్ టచ్ చేయాలని ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా ఈమధ్య కామెడీని బాగా మిస్సయ్యానని, కుదిరితే కామెడీ జానర్ లో సినిమా చేస్తానని చెప్పాడు.
అక్కడితో ఆగకుండా బుచ్చిబాబు సినిమాలో తను కొంత కామెడీ చేయబోతున్న విషయాన్ని కూడా బయటపెట్టాడు. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
చిరంజీవికి కామెడీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెరపై కామెడీ పండించడంలో మెగాస్టార్ దిట్ట. స్టార్ హీరోల్లో చిరంజీవిలా కామెడీ ఎవరూ పండించలేరనేది కూడా వాస్తవం. చిరు తనయుడిగా చరణ్ మాత్రం ఈ సెగ్మెంట్ లో ఇంకా వెనకబడి ఉన్నాడు.