
“సరిపోదా శనివారం” సినిమాలో ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్న వెంటనే అందరూ ఒక దానికి ఫిక్స్ అయిపోయారు. గతంలో ఈమెతో “గ్యాంగ్ లీడర్” అనే సినిమా చేశాడు నాని. అది ఫ్లాప్ అయింది. దీంతో ఆమెకు మరో అవకాశం ఇస్తానని నాని ప్రామిస్ చేసి ఉంటాడని అంతా అనుకున్నారు.
కానీ నాని వెర్షన్ మరో విధంగా ఉంది. తను ఎప్పుడూ ప్రియాంకకు అలాంటి ప్రామిస్ చేయలేదని చెప్పాడు. ఒకే ఒక్క కారణంతో మళ్లీ ఆమెను తీసుకున్నామని వెల్లడించాడు.
“గ్యాంగ్ లీడర్” సినిమాలో నాని-ప్రియాంక మధ్య సన్నివేశాలు చాలా తక్కువ. అలా ఉన్న 3-4 సీన్లు కూడా చాలా పెద్ద పాపులర్ అయ్యాయి అని అంటున్నాడు నాని. ఇప్పటికీ తమిళ్, మలయాళంలో ప్రేక్షకులు తను ప్రియాంకతో చేసిన సన్నివేశాల్ని ట్యాగ్ చేస్తుంటారని అన్నాడు.
ఒక సినిమాలో 3-4 సీన్స్ కే అంత రెస్పాన్స్ వచ్చినప్పుడు, సినిమా మొత్తం ఆమెతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే, మరోసారి ప్రియాంకను తీసుకున్నట్టు వెల్లడించాడు నాని.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది “సరిపోదా శనివారం” సినిమా.