![](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/08/maruthinagarthanks-1024x768.jpg)
విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రానికి బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో టీం ఆనందంగా ఉంది.
తబితా సుకుమార్
మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మా ఆయన సుకుమార్ గారికి థాంక్స్. నన్ను నమ్మి, నాకు సపోర్ట్‌గా నిలిచిన సుకుమార్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాకు కేవలం సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ మూవీని ప్రజెంట్ చేద్దామనే ఆలోచన అయితే లేదు. కానీ ఈ మూవీని చూసిన తరువాత ఇలాంటి ప్రాజెక్ట్ జనాల్లోకి బాగా వెళ్లాలని అనుకున్నా. నేను మూవీని చూసి ఎంత ఎంజాయ్ చేశాను.. ఎంత నవ్వుకున్నాను.. ఎంత సంతోషించానో.. జనాలు కూడా అదే ఫీల్ అవ్వాలని అనుకున్నాను. అందుకే ఈ మూవీని ప్రజెంట్ చేసేందుకు ముందుకు వచ్చాను. రామ్ చరణ్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించండి అని ఉపాసన గారికి మెసెజ్ పెట్టాను. నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నా.. ట్రైలర్ చూడండి అని నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. సమంత, స్వప్నా దత్, రష్మిక, నవీన్ పొలిశెట్టి వంటి వారు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీలా మాకు సపోర్ట్‌గా నిలిబడింది. ఈ సినిమాలోని కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నాను. పుష్ప క్లైమాక్స్ షూట్‌లో ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయి ఉన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు అల్లు అర్జున్. ఆయన రావడం వల్లే సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది. మైత్రీ శశి గారు ముందుకు వచ్చి మాకు సపోర్ట్‌గా నిలిచారు. హరి, శశి, రవి, అశోక్, శ్రీనివాస్, వేమ ఇలా అందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు.
రావు రమేష్
మా సినిమాకు మీడియా నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. మంచి రివ్యూలు వచ్చాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. మిడిల్ క్లాస్ స్క్రిప్ట్ ఎంచుకోవడం తప్పా? అని అనుకున్నాను. మిడిల్ క్లాస్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతుంది. వాళ్లను కించపర్చకుండా ఈ సినిమాను లక్ష్మణ్ గొప్పగా తీశాడు. కామెడీ కోసం వాళ్లని కించపర్చకూడదు. ఈ సినిమా బ్యూటీ అదే. సింప్లిసిటీగా ఉండి.. బ్యూటీఫుల్‌గా సినిమాను తీయడం గొప్ప విషయం. ఈ సినిమాను ముందుకు నడిపించిన మోహన్, తబిత గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్.
డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
మా చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టికెట్లు సేల్ అవుతున్నాయి.. షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి.. మా సినిమాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తుంటే మా కడుపులు నిండినట్టుగా అనిపిస్తోంది. మౌత్ టాక్‌తో ఈ మూవీ ముందుకు వెళ్తుందని మాకు తెలుసు. ఫ్యామిలీ అంతా వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లేలా సినిమా ఉంటుంది.