గోపీచంద్ తో ‘విశ్వం’ సినిమా చేశాడు శ్రీనువైట్ల. ఈ మూవీ తర్వాత అతడు ఏం చేయబోతున్నాడు? ‘విశ్వం’ రిజల్ట్ చూసి కొత్త సినిమా ప్రకటిస్తాడా? లేక ఆల్రెడీ మరో సినిమా పనిలో ఉన్నాడా?
దీనికి సంబంధించి అతడు వివరాలు వెల్లడించాడు.
“వెంకీ లాంటి సినిమా తీస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకునే సినిమా వస్తోంది. ఇంకా చెప్పాలంటే వెంకీ ఫస్టాఫ్ లో కామెడీ పీక్ లో ఉంటుంది. సెకండాఫ్ లో క్రైమ్ వల్ల కొంచెం కామెడీ తగ్గుతుంది. కానీ నెక్ట్స్ నేను చేయబోయే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటుంది. ఫస్టాఫ్ లో ఎంత కామెడీ ఉంటుందో, దానికి మించిన కామెడీ సెకెండాఫ్ లో ఉంటుంది.”
‘వెంకీ’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తన కొత్త సినిమాకు కథ రాసుకున్నానని, వెంకీ కంటే బెటర్ గా అది ఉంటుందని చెబుతున్నాడు వైట్ల.
అయితే అది ‘వెంకీ’ సినిమాకు పార్ట్-2 మాత్రం కాదని, పూర్తిగా కొత్త కథ అని కూడా క్లారిటీ ఇచ్చాడు.