
చాలా మంది హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ ని బ్రాండ్ ప్రమోషన్ ల కోసం ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దగా సినిమా ఆఫర్లు లేని హీరోయిన్లు మాల్దీవుల్లో ఉన్న అనేక రిసార్ట్ లకు వెళ్లి అక్కడ నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇదంతా ఆ పర్టిక్యులర్ రిసార్ట్ ప్రచారం కోసం.
అలా చేసినందుకు, ఆ హీరోయిన్లకు మంచి డబ్బు అందుతుంది. ఉచితంగా వెకేషన్ కూడా లభిస్తుంది. వేదిక, సోనాల్ చౌహన్, మలైకా అరోరా వంటి హీరోయిన్లు అందుకే ఎక్కువగా రిసార్ట్ లకు వెళ్లి బికినీలతో ఫోజులు ఇస్తుంటారు.
సోనాల్ చౌహన్ తాజాగా ఒక రిసార్ట్ ప్రచారం కోసం ప్రతిరోజూ బికినీ వేసుకొని ఆ ఫోటోలను షేర్ చేస్తోంది. కుర్రకారుకి మంచి కనువిందు.
ALSO CHECK: Photos of Sonal Chauhan in her swimwear

తెలుగులో ఎక్కువగా బాలయ్య, నాగార్జున సరసన నటించిన సోనాల్ కి ప్రస్తుతం ఏ సినిమాలోనూ ఆఫర్ లేదు. ఐతే, ఇన్ స్టాగ్రామ్ లో 80 లక్ష ఫాలోవర్స్ వరకు ఉన్నారు. అలా ఆ పాపులారిటీని ఇలా సంపాదనకు ఉపయోగిస్తోంది.