రంజాన్ తో పాటు వీకెండ్ మొదలు, అలాగే సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానుండడంతో చిన్న చిత్రాలు, మీడియం రేంజ్ చిత్రాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. ఈ వారం తెలుగునాట అరడజన్ చిత్రాలు విడుదల కానున్నాయి.
ఏప్రిల్ 11
అంజలి హీరోయిన్ గా నటించిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” ఈ వారం సినిమాల్లో ప్రధానమైనది. ఈ హారర్ కామెడీ సూపర్ హిట్ “గీతాంజలి” చిత్రానికి సీక్వెల్. ఇది అంజలికి 50వ చిత్రం. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాతో తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన అనువాద చిత్రం “లవ్ గురు” పోటీపడుతోంది.
ఏప్రిల్ 12
ఏప్రిల్ 12న ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ కుమార్ నటించిన “డియర్” అనే డబ్బింగ్ మూవీ విడుదల కానుంది. కొత్తగా పెళ్లయిన జంట గురక సమస్యతో బాధపడే కామెడీ చిత్రం ఇది.
రుహాని శర్మ హీరోయిన్ గా, సుహాస్ తదితరులు నటించిన “శ్రీరంగనీతులు”, “రోటి కాపడా రొమాన్స్”, “తిప్ప సముద్రం” వంటి చిన్న చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి.