ప్రతి సంక్రాంతికి నాలుగు, ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్లు దొరక్క ఇబ్బంది పడుతున్నా ఎవరూ తగ్గడం లేదు. వచ్చే సంక్రాంతికి అంటే 2025 సంక్రాంతి పండక్కి అప్పుడే ఆరు చిత్రాలు కర్చీఫ్ వేశాయి.
ఇవే ఆ ఆరు చిత్రాలు …
విశ్వంభర
ది రాజాసాబ్
వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ
రవితేజ 75
బంగార్రాజు 2
శతమానం భవతి 2
విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరి 10, 2025న ఇది విడుదల అవుతుంది. మిగతా సినిమాలు ఎలా ఉన్నా చిరంజీవి మూవీ మాత్రం సంక్రాంతికి విడుదల కావడం పక్కా.
ది రాజాసాబ్
ప్రభాస్, మారుతి డైరెక్షన్లో “ది రాజా సాబ్” సినిమా రూపొందుతోంది. ప్రస్తుతానికి ఇది సంక్రాంతి సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ సినిమాల విడుదల తేదీలు అనేకసార్లు మారడం కామన్. ప్రస్తుతానికి ఇది సంక్రాంతి బరిలో ఉంది.
వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ
వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోంది. తాజాగా ప్రకటన వచ్చింది. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ ఈ సినిమాకి డేట్ మాత్రం సంక్రాంతి పండుగనే. ముందే ప్రకటించింది టీం.
రవితేజ 75
రవితేజ కొత్త దర్శకుడు చెప్పిన ఒక కథ ఓకే చేశాడు. ఇది ఆయనకి 75వ చిత్రం. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ నిర్మాణ సంస్థ సితార ఈ సినిమాని సంక్రాంతికి తెస్తామని ప్రకటించింది. ఐతే, ఈ నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ల విషయంలో ఎప్పుడూ మాటకు కట్టుబడి ఉండదు. అనేకసార్లు డేట్స్ మారుస్తూ ఉంటుంది. సితార వాళ్ళ సినిమా అంటే కనీసం రెండు సార్లు వాయిదా పడాల్సిందే. కాబట్టి ఇది సంక్రాంతి బరిలో ఉంటుందా అనేది డౌటే.
బంగార్రాజు 2
నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. తన సినిమాలు సంక్రాంతికి తప్ప మిగతా టైంలో ఆడవు అనే భయం పట్టుకొంది నాగార్జునకు. అందుకే 2025 సంక్రాంతికి ముందే కర్చీఫ్ వేశారు.
శతమానం భవతి 2
ఇంకా మొదలుకాని “శతమానం భవతి 2” కూడా సంక్రాంతి 2025కి ప్లాన్ చేస్తోంది.