ప్రభాస్ కి “డై హార్డ్ ఫ్యాన్స్” ఎక్కువ. ఆయన సినిమాల అప్డేట్స్ ఇవ్వకపోయినా నిర్మాతలను తిడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. ప్రభాస్ అంటే అంతా పిచ్చి వాళ్లకు. అంతే కాదు, ప్రభాస్ ని తక్కువ చేస్తూ ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే వాళ్ళని ఒక రేంజ్ లో ఆడుకుంటారు.
అల్లు అర్జున్ అభిమానులకు ఇప్పుడు తెలిసి వచ్చింది అని చెప్పొచ్చు. “పుష్ప 2” టీజర్ విడుదలకు అల్లు అర్జున్ అభిమానులు చాలా హంగామా చేశారు. ఈ టీజర్ వచ్చిన తర్వాత టీజర్లకు వచ్చిన వ్యూస్ విషయంలో రికార్డులు అనేవి ఉండవు. అన్ని ‘పుష్ప 2’ టీజర్ పేరుమీద ఉంటాయి అని పాపం వాళ్లు ఆశపడ్డారు. ఆ ఆశతో కొంచెం ఎక్కువగా సవాళ్లు విసిరారు.
కానీ “పుష్ప 2” టీజర్ ఏ రికార్డులు నెలకొల్పలేదు. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దేశమంతా ట్రెండ్ అయింది. ఐతే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ రాబట్టడంలో కానీ, తక్కువ టైములో ఎక్కువ లైక్స్ పొందడంలో కానీ ఈ సినిమా ప్రభాస్ సినిమాల ముందు తేలిపోయింది.
ఇప్పటికే వ్యూస్ పరంగా “సలార్ 2″,”ఆదిపురుష్” వంటి సినిమాలదే పైచేయి. దాంతో, ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.