
ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలు సులువుగా వంద కోట్ల క్లబ్బులో చేరేవి. తెలుగు పెద్ద హీరోల సినిమాలు 50 కోట్లకు మించి కలెక్ట్ చేయలేని కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు 150 కోట్లు, 200 కోట్లు కలెక్ట్ చేసేవి ఇండియాలో. అప్పట్లో సల్మాన్ రేంజ్ అది. ఇప్పుడు తెలుగు హీరోల సినిమాలు 600 నుంచి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నాయి. కానీ పాపం సల్మాన్ ఖాన్ సినిమాలు 150 కోట్లు కూడా వసూల్ చెయ్యలేకపోతున్నాయి.
తాజాగా మురుగదాస్ తీసిన “సికిందర్” సినిమా పరిస్థితి ఘోరం. విడుదలైన ఆరు రోజుల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా 90 కోట్ల వద్దే నిలిచింది. ఇప్పటికే సినిమా కుప్పకూలింది. 100 కోట్ల వసూళ్లు కూడా రాకముందే చాప చుట్టేసింది.