
హీరోయిన్ నయనతార నటించిన ‘టెస్ట్’ అనే సినిమా నేరుగా ఓటీటీలోకి (Netflix) వచ్చింది. ఈ పరీక్షలో ఆమె ఫెయిలైంది. సినిమా అస్సలు బాగాలేదంటూ కామెంట్స్ పడుతున్నాయి. మూవీలో మంచి తారాగణం ఉంది. నయనతారతో పాటు సిద్దార్థ్, మాధవన్ లాంటి నటులున్నారు.
అయితే చెప్పాల్సిన పాయింట్ ను సాగదీశారు. నటీనటుల పెర్ఫార్మెన్సులు బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే నీరసంగా సాగడంతో ‘టెస్ట్’ ఫెయిలైంది.
మరోవైపు ధనుష్ అభిమానులు కూడా విపరీతంగా నెగెటివ్ పబ్లిసిటీ చేయడం కూడా ఈ సినిమాను దెబ్బతీసింది. నయనతార-ధనుష్ మధ్య కాపీరైట్ ఇష్యూకు సంబంధించి కోర్టు కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి ‘టెస్ట్’ సినిమా ఫెయిలవ్వడానికి కంటెంట్ లోపాలతో పాటు సరిగ్గా ప్రమోషన్ చేయకపోవడం, సోషల్ మీడియాలో నెగెటివ్ పబ్లిసిటీ కూడా కారణాలుగా నిలిచాయి