
రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు తీస్తున్న చిత్రం “పెద్ది”. శ్రీరామ నవమి సందర్భంగా “పెద్ది” ఫస్ట్ షాట్ వీడియోని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తాడు. బ్యాట్ తో ఫస్ట్ షాట్ కొట్టే వీడియోని విడుదల చెయ్యబోతున్నారు కాబోలు. అందుకే ఈ వీడియోకి ఫస్ట్ షాట్ అనే పేరు పెట్టారు అని అంటున్నారు.
ఆ ఫస్ట్ షాట్ వీడియోలో ఏమి ఉండబోతుందో మనకి శ్రీరామనవమి నాడు తెలుస్తుంది. ఈ వీడియో ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు విడుదల కానుంది. ఈ ఫస్ట్ షాట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల అవుతుంది.
బుచ్చి బాబు, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తుది మిక్సింగ్ పనిని పూర్తి చేశారు. ఇటీవల రెహమాన్ కొంత అస్వస్థతకి గురి అయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. దాంతో మిక్సింగ్ కూడా పూర్తి చేసి ఇలా ఫోటోకి పోజు ఇచ్చారు.
ALSO READ: మళ్ళీ టూర్లకి రెహ్మాన్ రెడీ
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
“పెద్ది” వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా విడుదల అవుతుంది.