Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

‘అదుర్స్ 2’ అందుకే చెయ్యలేదు: ఎన్టీఆర్

Cinema Desk, April 4, 2025April 4, 2025

‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ మూవీ విజయోత్సవ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దర్శకుడి ప్రతిభ కనిపించింది: ఎన్టీఆర్

“నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. మ్యాడ్ 2 తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్. ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. కానీ కళ్యాణ్ అది సాధించగలిగాడు. ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైన హృదయం. మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అది. చాలా ప్యూర్ గా కథను రాయగలగాలి. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, మీ కెరీర్ లో అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కంగ్రాట్స్.

ఆ కిక్ వేరు: ఎన్టీఆర్

“ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ గారు అద్భుతంగా నటించారు. ఒక క్యారెక్టర్ ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానిని నిజమైన పర్ఫామెన్స్ యాక్టర్ ఇవ్వగలిగినప్పుడు ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్ గా నాకు తెలుసు. ఈ సినిమాకి పిల్లర్ లా నిలిచిన మురళీధర్ గారికి కంగ్రాట్స్. అలాగే ఆంథోనీ. సినిమా చూస్తూ, అతను ఎంటర్ అయినప్పుడు నేను కూడా చప్పట్లు కొట్టాను. మ్యాడ్-1 లో ఆంథోనీ అంటే దేంతోని అంటారు. నేను మరిచిపోలేని క్యారెక్టర్ అది. ఒక కామెడీ చేయగలిగిన క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోలా ఎంట్రీ ఇవ్వడం బాగుంది. లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపించింది. నన్ను అందరూ అడుగుతుంటారు రాముడిగా చేయడం కష్టమా, రావణుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే కష్టం. ఎందుకంటే ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్ లో. ఆ ఇన్నోసెన్స్ విష్ణు బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనలో ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదు. సంగీత్ ని, వాళ్ళన్నయ్య సంతోష్ ని చూస్తే.. నాకు వాళ్ళ నాన్నగారు శోభన్ గారే గుర్తుకొస్తారు. నేను శోభన్ గారిని ఒకసారి కలిశాను. ఆయనంత హంబుల్ గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. శోభన్ గారు మన మధ్యే ఉండి, సంగీత్ సక్సెస్ ని చూసి గర్వపడుతున్నారు అనుకుంటున్నాను. మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకి వెళ్లిపోండి. సంగీత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.

అదుర్స్ 2 చెయ్యడానికి భయపడుతున్నా

“మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్ గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు. మ్యాడ్ లో రామ్ నితిన్ అద్భుతంగా నటించాడు. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నాను. రామ్ నితిన్ కి మంచి భవిష్యత్ ఉంది.

నితిన్ సక్సెస్ చూసి గర్వపడుతున్నా: ఎన్టీఆర్

నాకు 2011 లో పెళ్లి అయింది. నార్నె నితిన్… చాలా చిన్న పిల్లోడు అప్పుడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యంగా చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. నేను నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు.

అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా నాగవంశీ. సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. మాట కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. మా చినబాబు గారి చిన్నితల్లి హారిక నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ జన్మ అభిమానులకు అంకితం అని నాన్నగారితో చెప్పాను. మిమ్మల్ని ఆనందపరిచే సినిమాలు చేస్తూ ఉంటాను.”

న్యూస్ Mad SquareMad Square CelebrationsNTR

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Prabhas
    ప్రభాస్ మేనియా పని చేస్తుందా?
  • Kajal
    బికినీ ఫోటోలకు ఇది టైమా?
  • Sadanira
    శుక్రవారం నుంచి ‘సదానిర’
  • Varaalxmi with Jerome Irons
    అంతర్జాతీయ చిత్రంలో వరలక్ష్మి!
  • Malavika Mohanan
    డైరక్టర్ అవ్వాలని అనుకుందట
  • Shruti Haasan
    శృతిహాసన్ కి 3 రోజులు పట్టింది
  • Anjanamma and Naga Babu
    అమ్మ బాగానే ఉందన్న నాగబాబు
  • Avatar and Govinda
    అవతార్ మాట ఉత్తదే
  • Shankar
    శంకర్ బద్నామ్ అయ్యాడు
  • Niharika
    నిహారిక మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది!
  • Tamannaah and Fatima
    తమన్నని వదిలి ఫాతిమాతో!
  • Salman Khan
    సల్మాన్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట
  • Mrunal Thakur
    అలా ఇబ్బంది పడుతున్న మృణాల్
  • Kuberaa
    వివాదంపై స్పందించిన నాగార్జున
  • Rashmika
    రష్మికలో సౌందర్య కనిపించింది

ఇతర న్యూస్

  • ప్రభాస్ మేనియా పని చేస్తుందా?
  • బికినీ ఫోటోలకు ఇది టైమా?
  • శుక్రవారం నుంచి ‘సదానిర’
  • అంతర్జాతీయ చిత్రంలో వరలక్ష్మి!
  • డైరక్టర్ అవ్వాలని అనుకుందట
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us