
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ కోసం హీరోయిన్ నిధి అగర్వాల్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎఁదుకంటే, ఈ సినిమా హిట్టయితే కెరీరా ఊపందుకుంటుందనేది ఆమె ఆశ.
అయితే ఈ సినిమా కోసం మరొకరు కూడా ఎదురుచూస్తున్నారు. ఆమె అనసూయ. పవన్ సినిమాలో అనసూయ కూడా ఉంది. పవన్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అయితే ఈ సినిమాలో తనది స్పెషల్ సాంగ్ మాత్రమే కాదని, ఆ సాంగ్ కు ముందు, దాని తర్వాత తన పాత్ర ఉంటుందని అంటోంది అనసూయ.
ALSO CHECK: Anasuya in a jamun Saree
సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని, ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది అనసూయ. ‘కొల్లగొట్టినాదిరో’ అనే పాటలో అనసూయతో పాటు పూజిత పొన్నాడ కూడా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘హరిహర వీరమల్లు’ సినిమా. వచ్చేనెల 9న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. పవన్ ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయలేదు.