
బెట్టింగ్ యాప్ కేసులో ఏకంగా 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్లు, ఐదుగురు నటీనటులపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని స్టేషన్ కు పిలిచి విచారించారు.
రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను మాత్రం పోలీస్ స్టేషన్ కు పిలిపించలేదు. ఓ వైపు ఈ కేసు నడుస్తుండగానే, మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. సెలబ్రిటీలది తప్పు లేదు అనే కోణంలో మాట్లాడాడు.
సెలబ్రిటీలు కేవలం ఓ ఉత్పత్తికి ప్రచారం కల్పిస్తామని, తమ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటారని, ఆ ఉత్పత్తుల్లోకి లోతుగా వెళ్లి ఆలోచించరని, అది వాళ్ల తప్పు కాదని అంటున్నాడు వర్మ. బెట్టింగ్ యాప్స్ అనేవి దాదాపు దశాబ్దానికి పైగా చలామణిలో ఉన్నాయని, అవి అంత ప్రమాదకరని తెలియదు కాబట్టే సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేశారని అన్నారు.
తెలిసి ఎవ్వరూ తప్పుచేయరని, ఈ విషయంలో సెలబ్రిటీల్ని హింసించడం సరికాదని అభిప్రాయపడ్డాడు రామ్ గోపాల్ వర్మ.