
‘జాక్’ సినిమాకు సంబంధించి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరో సిద్ధు జొన్నలగడ్డ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయంటూ గతంలో చాలా కథనాలొచ్చాయి. తాజాగా వాటిపై ఇద్దరూ కలిసి స్పందించారు. పరోక్షంగా ఆ పుకార్లను అంగీకరిస్తూనే, తామిద్దరి మధ్య ఏం లేదని అనేశారు.
ముందుగా బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ… సిద్ధూ ప్రతి విషయంలో చాలా డీప్ గా చొరవ తీసుకుంటాడని, అతడికి చాలా విభాగాల్లో పట్టుఉందని అన్నాడు. డిస్కషన్ రూమ్ లో తామిద్దరం సినిమా కోసం వాదించుకుంటామని, కొట్టుకునే వరకు కూడా వెళ్తామని, ఓ యుద్ధంలా ఉంటుందని అన్నాడు.
ఇక మరో పుకారుపై సిద్ధు కూడా క్లారిటీ ఇచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ లేకుండా ఓ సాంగ్ షూట్ చేశామని చెప్పాడు. ఆ టైమ్ లో దర్శకుడు ఎడిటింగ్ లో బిజీగా ఉండడం వల్ల, అతడి అనుమతి తోనే, అతడు లేకుండా ఓ సాంగ్ షూట్ పూర్తిచేశామని అన్నాడు.
మొత్తానికి తమ మధ్య చిన్న గ్యాప్ అయితే ఉందనే విషయాన్ని వీళ్లిద్దరూ పరోక్షంగా వెల్లడించారు. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో కూడా బొమ్మరిల్లు భాస్కర్ మార్కు లేదు. సిద్ధు మార్క్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ట్రయిలర్ లో బూతులు కూడా ఉన్నాయి. అది కచ్చితంగా బొమ్మరిల్లు భాస్కర్ బ్రాండ్ అయితే కాదు.