
ఒకప్పుడు మోహన్ బాబు అంటే అందరికీ హడల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా భయపడేది…. ఆయన మాటకి, ఆయన చేష్టలకి. ఇప్పుడు మోహన్ బాబు తన కొడుకులకే భయపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలను కూడా గద్దించేవారు. ఇప్పుడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారేమో అని ఆయనే భయపడుతున్నారు.
కాలం, వయసు అన్నింటిని తలకిందులు చేశాయి. అంతకన్నా ముఖ్యంగా సన్ స్ట్రోక్ బాగా తగిలింది మోహన్ బాబుకు. అందుకే ఇప్పుడు పూర్తిగా వేదాంతం పలుకుతున్నారు.
మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో తన కుటుంబ గొడవల ప్రస్తావన తేకుండా ఒక మాట చెప్పారు. “అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తుండేవారు… పిల్లలను కనగలం కానీ వారి తలరాతలను కనలేం అనేవారు. ఆ మాట ఇప్పుడు నిజం అనిపిస్తోంది.” ఇది మోహన్ బాబు పలుకు. చిన్న కొడుకు మనోజ్ చేసిన గొడవ, పెద్ద కొడుకు విష్ణు పట్టింపులతో మోహన్ బాబుకి వేదాంతం వచ్చేసింది.
ఇక ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు. ఎవరినీ నిందించను అని ముగించారు.