
తను టాలీవుడ్ కు దూరమవ్వలేదంటున్నాడు గాయకుడు సిద్ శ్రీరామ్. తన దగ్గరకొచ్చిన సాంగ్స్ నుంచి, మనసుకు నచ్చిన పాటలు పాడుతూనే ఉన్నానని తెలిపాడు. పెద్ద బ్యానర్లు, పెద్ద సంగీత దర్శకుల నుంచి తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే వాదనను తోసిపుచ్చాడు.
‘పుష్ప’ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్, ఛార్జ్ బస్టర్ గా నిలిచింది. అయితే ‘పుష్ప-2’లో మాత్రం సిద్ శ్రీరామ్ గొంతు వినిపించలేదు. దీనిపై స్పందించడానికి సిద్ శ్రీరామ్ నిరాకరించాడు. ఆ విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నే అడగాలన్నాడు.
అమెరికా నుంచి వచ్చి, హైదరాబాద్-చెన్నైలో పాటలు పాడి తిరిగి అమెరికా వెళ్లిపోయే ఈ సింగర్.. తన గాత్రంపై వస్తున్న విమర్శల్ని పట్టించుకోనంటున్నాడు. తెలుగు పదాల్ని సరిగ్గా ఉచ్ఛరించననే కామెంట్స్ తన వరకు రాలేదంటున్నాడు. తనకు ఓ ఏడాది టైం ఇస్తే, తెలుగులో అనర్ఘలంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.
హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు సిద్ శ్రీరామ్. ఇందులో తన సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు.. 80-90 దశకాల్లో వచ్చిన మెలొడీ సాంగ్స్ ను తన గొంతుతో వినిపించబోతున్నాడు.