
డిసెంబర్ లో నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్నారు. ఓవైపు ఆ పెళ్లి ఏర్పాట్లలో అంతా బిజీగా ఉన్న టైమ్ లో, ఉరుములేని పిడుగులా తన ఎంగేజ్ మెంట్ మేటర్ బయటపెట్టాడు అఖిల్. జైనాబ్ అనే అమ్మాయితో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ అక్కినేని హీరో, ఆమెను తన అర్థాంగిగా చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
సింపుల్ గా నిశ్చితార్థాన్ని పూర్తిచేసిన ఈ హీరో, పెళ్లిని మాత్రం గ్రాండ్ గా చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ మేరకు నాగార్జున పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మార్చిలో అఖిల్-జైనాబ్ వివాహం ఉంటుంది.
నాగచైతన్య-శోభిత, అన్నపూర్ణ స్టుడియోస్ లోనే పెళ్లి చేసుకున్నారు. చిన్న కొడుకు పెళ్లి కూడా అక్కడే చేయాలని నాగార్జున ఆలోచిస్తున్నారట. అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందా లేక స్టుడియోలోనే పెళ్లి చేస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
పెళ్లి ఎక్కడ జరిగినా, రిసెప్షన్ ను గ్రాండ్ గా ఏర్పాటుచేయబోతున్నారు. సినీరాజకీయ ప్రముఖులతో పాటు.. క్రికెట్ నుంచి కూడా ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించలేదు అఖిల్.