వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న మరో సినిమా… “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అరకులో ప్రారంభమైయింది.
వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య భార్యగా నటిస్తుండగా, మీనాక్షి వెంకటేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా వేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్ కి ఇటీవల సోలో హీరోగా హిట్ దక్కడం లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ఈ మూవీ ఒప్పుకున్నాడు. ఇందులో మరో హీరో లేరు.
Advertisement