చిన్న సినిమాల్ని తొక్కేస్తున్నారు… చిన్న సినిమాలకు టాలీవుడ్ పెద్దలు మద్దతివ్వరు లాంటి స్టేట్ మెంట్స్ చాలానే చూస్తుంటాం. కొన్ని సినిమాలకు పెద్దల మద్దతు దొరుకుతుంది, మరికొన్ని సినిమాలకు సపోర్ట్ పెద్దగా దొరకదు.
ఈ మొత్తం వ్యవహారంపై దిల్ రాజు స్పందించారు. అసలెందుకు సపోర్ట్ చేయాలనేది దిల్ రాజు బేసిక్ క్వశ్చన్. ఇక్కడంతా బిజీగా ఉంటారని, ఎవరి వ్యాపారాలు, ఎవరి సినిమాలు వాళ్లవని…. మరో సినిమాను పట్టించుకునే తీరిక ఎవ్వరికీ ఉండదనే అన్నారు.
ఇండస్ట్రీలో ఎవడి కష్టం వాడిదే అంటున్నారు దిల్ రాజు. ఎవరికి వారు ప్రూవ్ చేసుకోవాలని, అప్పుడే ఇండస్ట్రీ గుర్తిస్తుందన్నారు.
సినిమా సక్సెస్ అయితే తనలాంటి పెద్దలు ముందుకొచ్చి మెచ్చుకుంటారని, అంతకుమించి సపోర్ట్ ఆశించొద్దని కుండబద్దలుకొట్టారు.
ప్రతి ఒక్కరికి, ప్రతి సినిమాకు పరిశ్రమలో స్థానం ఉంటుందని, ఏ సినిమాకు ఏ స్థాయిలో థియేటర్లు దొరకాలో అలానే జరుగుతుందని.. మరొకరిపై నిందలు వేసి టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. కష్టపడి పని చేసి, మంచి కంటెంట్ క్రియేట్ చేయాలని సూచిస్తున్నారు.