కొంతమందికి కొన్ని సినిమాలు అలా నచ్చేస్తుంటాయి. ఎందుకంటే రీజన్ ఉండదంతే. ఈ లిస్ట్ లో హీరోలు, హీరోయిన్లు కూడా ఉంటారు. అలాంటి ఓ సినిమాను బయటపెట్టింది హీరోయిన్ రుక్మిణి వసంత్.
ఈ ముద్దుగుమ్మకు ‘ఓం శాంతి ఓం’ సినిమా అంటే చాలా ఇష్టంమంట. షారూక్, దీపిక పదుకోన్ నటించిన ఆ సినిమాను దాదాపు 60 సార్లు చూసి ఉంటానని చెప్పుకొచ్చింది. వారంలో కనీసం రెండు సార్లయినా ఆ సినిమా చూసేదంట.
యాక్టింగ్ నేర్చుకునేందుకు లండన్ వెళ్లింది రుక్మిణి వసంత్. ఆ టైమ్ లో షారూక్ సినిమాను 60 సార్లు చూశానని చెప్పుకొచ్చింది.
ALSO READ: Rukmini Vasanth loves to pose in Saree
“సప్త సాగరాలు దాటి” అనే డబ్బింగ్ చిత్రంతో పాపులర్ అయింది. ఆ తర్వాత చేసిన “భగీర”, తాజాగా విడుదలైన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” ఢమాల్ అన్నాయి.
Advertisement