ఆల్రెడీ వీక్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. షూటింగ్ లో చిన్న చిన్న గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆ గాయాలతోనే షూటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మరోసారి గాయపడ్డాడు విజయ్.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన విజయ్, మెట్లు దిగితూ ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కాడు. అయితే అతడు పడిన విధానం చూస్తే మాత్రం నడుముకు దెబ్బ తగిలే ఉంటుందని అనుకుంటున్నారు చాలామంది.
ఎందుకంటే, అతడు మెట్లు పైనుంచి జారిపడ్డప్పుడు మీడియా అక్కడే ఉంది. అంతేకాదు, కొంతమంది ఆ ఘటనను షూట్ చేశారు కూడా. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.
జస్లీన్ రాయల్ తో ఓ వీడియో సాంగ్ చేశాడు విజయ్ దేవరకొండ. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కోసం ముంబయి వెళ్లాడు. అక్కడే ఇలా కాలుజారాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. అతడి నుంచి రాబోయే సినిమా అదే.