వెంకటేష్. దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన “ఎఫ్ 2”, “ఎఫ్ 3” సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పడు “సంక్రాంతికి వస్తున్నాం” అనే మరో సినిమా వస్తోంది.
“ఎఫ్2”, “ఎఫ్3” సినిమాలు నవ్వు ప్రధానంగా సాగాయి. కానీ ఈ సినిమాలో క్రైం కూడా ఉంది. అలాగే ‘సుందరకాండ’ తరహాలో భార్య, ఒక అమ్మాయి యాంగిల్ ఉంది. అంటే ఇందులో హీరో వెంకటేష్ కి మీనా (ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్), అపర్ణ (ఈ సినిమాలో మీనాక్షి చౌదరి) తరహా త్రికోణ కథ కూడా ఉంది.
కానీ ఇది ప్రధానంగా ఇవివి సత్యనారాయణ సినిమాల తరహాలో ఉంటుందట. ముఖ్యంగా వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ ఒకే బెడ్ రూమ్ లో పడుకోకుండా మురళీధర్ గౌడ్ పెట్టె పరీక్షలు చాలా కామెడీగా ఉంటాయిట.
భార్యాభర్తలుగా నటించిన వారిద్దరూ ఎందుకు ఒకే రూంలో ఉండలేరు అనేది ఈ సినిమాలో మెయిన్ కామెడీకి పాయింట్.
ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి వస్తోంది.