హీరోయిన్ రష్మిక పెళ్లి ముచ్చట ఇది. ఆమె ప్రేమలో ఉన్న మాట నిజం. హీరో విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది అనేది అందరికీ తెలిసిన మేటర్.
వారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అని చాలా కాలంగా వినిపిస్తోంది. తాజాగా నిర్మాత నాగవంశీ కూడా ఒక టాక్ షోలో రష్మిక ఒక తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పారు. ఐతే, ఈ ఏడాది రష్మిక పెళ్లి చేసుకుంటుందా?
ఇటీవల తన పెళ్లి గురించి, ప్రేమ గురించి చర్చ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ ఇలా స్పందించారు. “నేను చెప్పాలనుకునే టైంలో చెప్తాను. దాచుకునేదేమి లేదు. ఇది సరైన టైం అని భావించినప్పుడు ప్రపంచానికి తెలియచేస్తాను.”
ఇక రష్మిక మాత్రం పెళ్లి గురించి మౌన ముద్ర దాల్చుతోంది. 2025 మొదటి రోజు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇంట్లో చాలా సింపుల్ గా హోమ్ వేర్ ధరించి కూర్చున్న ఫోటోలు అవి. కొత్త సంవత్సరం మనందరం మంచిగా ఉందామని పోస్ట్ చేసింది. పెళ్లికి సంబంధించి ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు ఈ ఏడాది ఇన్ స్టాలో హింట్ ఇస్తుందా అనేది చూడాలి.
రష్మిక తన ఖాతాలో ఇప్పటికే రెండు భారీ పాన్ ఇండియన్ హిట్స్ (యానిమల్, పుష్ప) చేర్చుకొంది. ఈ ఏడాది ‘కుబేర’, ‘సికిందర్’, ‘చావా’ వంటి భారీ చిత్రాలు విడుదల కానున్నాయి.