ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడే కాదు గాయకుడు కూడా. పాటలు కూడా రాశారు. దాదాపు 60 వరకు పాటలు రాశారట. తాజాగా ఆయన ‘షష్టిపూర్తి’ అనే సినిమా కోసం లిరిక్ రైటర్ గా మారారు.
రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. ఇళయరాజా స్వరపరిచిన ఒక పాటకు కీరవాణి పల్లవి, చరణాలు రాయడం మరో విశేషం.
”మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ఆయన ద్వారా కీరవాణి గారిని అప్రోచ్ అయ్యాము. సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా, ఓకే అన్నారు. మేం స్టూడియోకు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది,” అని దర్శకుడు పవన్ ప్రభ. అన్నారు.
కీరవాణి, ఇళయరాజా కాంబినేషన్ ఇలా సెట్ అయింది.