ఇటీవల ఒక చర్చ కార్యక్రమంలో తెలుగు యువ నిర్మాత నాగ వంశీ బాలీవుడ్ చిత్రసీమ గురించి కొన్ని కామెంట్స్ చేశారు.ఆ మాటలు ఇప్పుడు బాలీవుడ్ లో అగ్గిని రాజేశాయి. నాగవంశీ అంటే ఎవరు? ఇతని ఏమి సినిమాలు తీశాడు అంటూ ఈ నిర్మాతకు గట్టిగా సమాధానం ఇస్తున్నారు.
“పుష్ప 2” సినిమా ఒకేరోజు 80 కోట్లు కలెక్ట్ చేసిన రోజు ముంబైలోని బాలీవుడ్ వాళ్లకు చాలామందికి నిద్ర పట్టి ఉండదు అని విమర్శించారు నాగవంశీ. అలాగే బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇటీవల పాన్ ఇండియా హిట్ చిత్రాలు ఇవ్వలేదు అన్నట్లుగా ఆయన వ్యాఖలు ఉన్నాయి. దాంతో సిద్ధార్థ్ ఆనంద్ వంటి పెద్ద దర్శకుల మొదలు హన్సల్ మెహతా వంటి సీనియర్ దర్శకుల వరకు అందరూ నాగవంశీని తప్పు పడుతున్నారు.
తాను తీసిన “స్కామ్” సిరీస్ నుంచి సీన్లు కాపీ కొట్టి “లక్కీ భాస్కర్” సినిమాని నిర్మించింది నాగవంశీ అని హన్సల్ మెహతా గుర్తు చెయ్యడం విశేషం.
తెలుగు సినిమా పరిశ్రమ పలు పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇంతకీ నాగవంశీ తీసిన పాన్ ఇండియా హిట్ ఏది అని మరికొందరు బాలీవుడ్ వాళ్ళు వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇంతకీ రేపు బాలయ్య నటించిన “డాకు మహారాజ్”ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి హిట్ కొట్టే దమ్ము ఉందా అని నాగవంశీని ఆడుకుంటున్నారు.