
సమంత మరో వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ మూడు రోజులుగా సోషల్ మీడియా కోడైకూసింది. ఆ వెబ్ సిరీస్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. కానీ సమంత మాత్రం సైలెంట్ అయింది.
రాజ్&డీకే కలిసి ఈ కొత్త వెబ్ సిరీస్ ప్రకటించారు. దీని పేరు “రక్త్ బ్రహ్మాండ్.” నెట్ ఫ్లిక్స్ కోసం వాళ్లు ఈ సిరీస్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే కేవలం సిరీస్ ను మాత్రమే ప్రకటించారు. నటీనటులు ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సమంత సైలెంట్ గా ఉందని కొందరు అంటున్నారు. త్వరలోనే సమంత పేరుతో మరోసారి ఈ సిరీస్ ను హైలెట్ చేస్తారని టాక్.
రాజ్&డీకే తో కలిసి సమంత ఇదివరకే “ఫ్యామిలీ మేన్ సీజన్-2” చేసింది. తాజాగా “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ కూడా చేసింది. ఆ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు “రక్త్ బ్రహ్మాండ్”లో కూడా ఆమె ఉందనే టాక్ నడుస్తోంది. ఇలా ఈ రాజ్-డీకేల నిర్మాణంలోనే సమంత వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
సమంత కొత్తగా ఒప్పుకున్న తెలుగు సినిమా కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.