రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం… “మిస్టర్ బచ్చన్”. రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా మీడియాతో హరీష్ శంకర్ ముచ్చటించారు.
హరీష్ శంకర్ చెప్పిన సంగతులు…
ఇది కూడా రీమేక్ చిత్రమే కదా. హిందీ సినిమాకి మీరు చేసిన మార్పులు ఏంటి?
1980 – 90ల కాలంలో జరిగే కథ “మిస్టర్ బచ్చన్.” ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ షాను పాటలు ఇవన్నీ కలిపితే “మిస్టర్ బచ్చన్.” ఫస్ట్ హాఫ్ లో చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి. హిందీకి, తెలుగుకి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇంతకుముందు మీరు రవితేజతో తీసిన “మిరపకాయ్” కన్నా ఇది బాగుంటుందా?
అప్పటికి, ఇప్పటికి నాకు చాలా ఎక్స్ పీరియన్స్ వచ్చింది. టేకింగ్ పరంగా, విజువల్స్ పరంగా మ్యూజిక్, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా “మిరపకాయ్” కంటే మిస్టర్ బచ్చన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా ఉంటుంది. నేను కేరీర్ లో చాలా వేగంగా పూర్తి చేసిన సినిమా ఇది. 78 రోజుల షూటింగ్ లో ఏ రోజు ఇబ్బంది పడలేదు.
“మిస్టర్ బచ్చన్” అనే టైటిల్ పెట్టడానికి కారణం మీరు, రవితేజ గారు అమితాబ్ ఫ్యాన్ కావడమేనా?
చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ గా ఉంటాం కాని అన్ని పేర్లుపెట్టలేం కదా. కథలో ఒక చిన్న పిట్టకథ బచ్చన్ కి సంబంధించి ఉంటుంది. అందుకు ఈ టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ ఆలోచన కూడా రవితేజ గారిదే.