హీరోయిన్ నభా నటేష్ లైవ్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది..
ఇష్టమైన కర్రీ...
నాకు మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. దీంతో పాటు ఇడ్లీ కూడా తింటాను. దాదాపు ప్రతి రోజూ నేను ఇడ్లీ తింటాను.
ఇష్టమైన నటుడు
తెలుగులో పవన్ కల్యాణ్.. తమిళ్ లో రజనీకాంత్.. కన్నడంలో అప్పు సర్.. హిందీలో షారూక్ ఖాన్.
లవ్ ఎఫైర్
నేను ఇప్పటివరకు కమిట్ అవ్వలేదు. నాకు ఎలాంటి ఎఫైర్లు లేవు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ప్రస్తుతం సినిమాలతోనే నా కమిట్ మెంట్.
ఇష్టమైన జానర్…
మర్డర్ మిస్టరీ జానర్ అంటే ఇష్టం. యాక్షన్ జానర్ లో కూడా ఓ సినిమా చేయాలని ఉంది..
వ్యాయామం…
ప్రతి రోజూ కచ్చితంగా రోజుకు 2 గంటలు వ్యాయామం చేస్తాను. అదే నా ఎనర్జీ బూస్టర్..