పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన చిరు, అక్కడ సందడి చేస్తున్నారు. భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకారతో కలిసి పారిస్ లో పర్యటిస్తున్న మెగాస్టార్.. అక్కడ్నుంచి రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానుల్ని అలరిస్తున్నారు.
పారిస్ వీధుల్లో సరదాగా తిరుగుతూ, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు చిరంజీవి.
ఒలింపిక్ టార్చ్ ను పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చారు. అలా వీధుల్లో నడుస్తూ.. భార్యతో కలిసి సెల్పీలు దిగారు. ఇలా ఒకటి కాదు, అడుగడుగునా చిరంజీవిలో ఉత్సాహం కనిపిస్తోంది. ముందుగా లండన్ లో సందడి చేసి, అట్నుంచి అటు పారిస్ వెళ్లిన మెగా కుటుంబం, మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతోంది.
ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో “విశ్వంభర” సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ టూర్ కోసం ఆ సినిమాకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది “విశ్వంభర”.