సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు కృష్ణవంశీ. ఓవైపు “మురారి” రీ-రిలీజ్ సందడి, మరోవైపు తన పుట్టినరోజు కలిసి రావడంతో కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు.
తనకు వీలైనంతవరకు ప్రతి పోస్టుకు స్పందిస్తూ వస్తున్నారు కృష్ణవంశీ. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.
ఇప్పటికే మహేష్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలపై స్పందించిన ఈ సీనియర్ దర్శకుడు.. తాజాగా “చెడ్డి గ్యాంగ్” సినిమాపై కూడా రియాక్ట్ అయ్యాడు.
“చెడ్డి గ్యాంగ్ సినిమా అంటే తనకిష్టమని, అలాంటి ఓ సినిమా తీయమని ఓ నెటిజన్, కృష్ణవంశీని కోరాడు. దీనిపై కృష్ణవంశీ సూటిగా స్పందించారు.
తను నెగెటివిటీని ప్రోత్సహించనని, సినిమా అనేది జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ఉండాలే తప్ప, రెచ్చగొట్టే మాదకద్రవ్యంగా ఉండకూడదని తన అభిప్రాయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు.